మహిళలకు స్వయం ఉపాధి శిక్షణకు ఆర్థిక సహాయం

మర్రి రాజశేఖర్ రెడ్డి, జగదీష్ గౌడ్

మహిళలకు స్వయం ఉపాధి శిక్షణకు ఆర్థిక సహాయం

WhatsApp Image 2025-10-16 at 7.34.24 PM మల్కాజిగిరి, అక్టోబర్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ముందడుగుగా మల్కాజిగిరి డివిజన్ సర్దార్ పటేల్ నగర్ మహిళా సమైక్య గ్రూప్ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేశారు. మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి రూ. 1,50,000/-, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ రూ. 1,00,000/- మంజూరు చేశారు. మొత్తం రూ. 2,50,000/- (రెండు లక్షల యాభై వేల రూపాయలు) మహిళల శిక్షణా కార్యక్రమం కోసం వినియోగించనున్నారు.ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ మాట్లాడుతూ, మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, రుణ సదుపాయాలను ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని పిలుపు నిచ్చారు. కుట్టు యంత్రాలు, ఇతర ఉపాధి సామాగ్రి కొనుగోలు చేసి స్వయం ఉపాధిని ఎంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య గ్రూప్ సభ్యులు ప్రేమలత, చంద్రకళ, లలిత, శారద, జయశ్రీ, వసంత, భాగ్యలక్ష్మి, మంజుల, తార, బిఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మణరావు, నీలం సతీష్, రాములు, శ్రీకాంత్, నవీన్ మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .