మేఘన్న అభయ హస్తం  ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం

మేఘన్న అభయ హస్తం  ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం

వనపర్తి జిల్లా ప్రతినిధి, తెలంగాణ ముచ్చట్లు:

 వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలోని జగత్ పల్లి గ్రామంలో  మేఘన్న అభయ హస్తం ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. గ్రామానికి చెందిన ముష్టి నాగమ్మ భర్త కండెన్న, ఏర్పుల నాగరాజు తండ్రి గట్టన్న మృతి చెందడం జరిగింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  గట్టు యాదవ్ ఎమ్మెల్యే  మేఘారెడ్డి  దృష్టికి తీసుకెళ్లగా, ఆయన  వెంటనే స్పందించి, అంత్యక్రియలు ఖర్చుల నిమిత్తం, ఇరువురు కుటుంబ సభ్యులకు 10000/- పదివేల రూపాయలు కాంగ్రెస్ నాయకుల ద్వారా అందజేశారు.బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని గట్టు యాదవ్ తెలిపారు.కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రయ్య, రాములు, చంద్రయ్య నాగన్న, నరసింహా, బాలస్వామి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .