ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి డాక్టరేట్ పొందిన తొలి గిరిజన బిడ్డ
మెగా వత్ రవిని సన్మానించిన గిరిజన నాయకులు
వనపర్తి జిల్లా ప్రతినిధి ,తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం గట్ల ఖానాపూర్ గ్రామం పుల్యా తండాకు చెందిన తల్లి బామిని,తండ్రి పుల్యా నాయక్ దంపతుల కుమారుడు అయిన మేఘవాత్ రవి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఫార్మసీ విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేటు పొందారు.వ్యవసాయ కుటుంబంలో జన్మించిన మెగావత్ రవి చిన్నప్పటి నుంచి తన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి చేయడం జరిగింది. మెగావత్ రవికి గిరిజన నాయకులు పెద్దమందడి మండల భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు కిషన్ నాయక్, బంజారా యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్ నాయక్ అభినందనలు తెలిపారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించి,ఉస్మానియా యూనిర్సిటీలో ఫార్మాస్యూటికల్ డిపార్టుమెంటు యందు ఫార్ములేషన్ అండ్ ఎవాల్యూషన్ ఆఫ్ లిపోసోమల్ జెల్ ఫర్ ట్రాన్స్డర్మల్ అప్లికేషన్ యూజింగ్ అంటిబ్యాక్టీరియల్ ఏజెంట్స్ అనే టాపిక్ పై పీహెచ్డీ పట్టా పొందారు. ప్రస్తుతం మహాత్మ జ్యోతిబాపులే బిసి గురుకుల చిట్యాల బాలుర పాఠశాలలో లైబ్రేరియన్ గా పనిచేస్తున్నారు.


Comments