మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ మలిదశ ఉద్యమ విద్యార్థి నాయకుడు ఉదయ్ కిరణ్ కుటుంబానికి ఆర్థిక సహాయం
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా చీమనగుంటపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ మలిదశ ఉద్యమ విద్యార్థి నాయకులు ఉదయ్ కిరణ్ చారి గత వారం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గతంలో ఉదయ్ కిరణ్ చారి బీఆర్ఎస్ వి ఉద్యమ విద్యార్థి నాయకులుగా పనిచేశారు. ఉదయ్ కిరణ్ ఆకస్మికంగా మృతి చెందడంతో వారి కుటుంబానికి మాజీ మంత్రి మానవత్వంతో 25000/-వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం ద్వారా అందజేశారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల వారి కుటుంబానికి తీరని లోటు అని, తొందరపాటు నిర్ణయాలు యువత తీసుకోకుండా ఆత్మస్థైర్యంతో సమస్యలను ఎదుర్కోవాలని నిరంజన్ రెడ్డి యువతను కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాణిక్యం, అధ్యక్షులు రఘు వర్ధన్ రెడ్డి, సూర్యవంశపు, గిరి,హేమంత ముదిరాజ్, మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాము, గ్రామ నాయకులు రామకృష్ణ, ధర్మశాస్త్రి, హర్షవర్ధన్ రెడ్డి, శంషుద్దీన్, రమేష్ నాయక్, సత్య, విష్ణు, భీముడు, రామచంద్ర పాల్గొన్నారు.


Comments