గంగారం బెటాలియన్‌లో గాంధీజయంతి వేడుకలు.
Views: 16
On
సత్తుపల్లి, అక్టోబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
బి.గంగారం గ్రామంలోని 15వ స్పెషల్ పోలీసు బెటాలియన్‌లో గురువారం మహాత్మా గాంధీజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ ఎం.పెద్దబాబు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ కీలకపాత్ర వహించారని, ఆయనను దేశ ప్రజలు జాతిపితగా, మహాత్ముడిగా గౌరవిస్తున్నారని పేర్కొన్నారు. సత్యం, అహింస గాంధీజీ ఆచరణలో పెట్టిన ముఖ్య సిద్ధాంతాలని, సహాయనిరాకరణ, సత్యాగ్రహమే ఆయనకు ప్రధాన ఆయుధాలని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ మహాత్ముని చూపిన మార్గంలో నడవాలని, ఆయన ఆశయాల సాధనకై కృషి చేయాలని కమాండెంట్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సహాయ దళాధిపతి ఎస్.శ్రీధర్రాజా, అధికారులు, కానిస్టేబుళ్లు పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు 
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments