సీఎం కప్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో కొణిజర్ల మండలంకు గోల్డ్ మెడల్
ఖమ్మం బ్యూరో,తెలంగాణ ముచ్చట్లు
ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగినసీఎం కప్ ఖమ్మం జిల్లా అథ్లెటిక్స్ త్రైయాతిలిన్ అండర్ 14 విభాగంలో (పరుగు పందెం 60 మీటర్స్ , 600 మీటర్స్ లాంగ్ జంప్) లలో కొణిజర్ల మండలం పెద్ద మునగాలకు చెందిన వేములకొండ రమేష్ కుమారుడు వేములకొండ చరణ్ గౌడ్ మొదటి బహుమతి గోల్డ్ మెడలను, అదేవిధంగా కిడ్ జావలిన్ లో ద్వితీయ బహుమతి సిల్వర్ మెడల్ సాధించి అథ్లెటిక్స్ విభాగంలో ప్రతిభ కనపరిచి అండర్ 14 విభాగంలో రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు ఎంపికయ్యాడు వేములకొండ చరణ్ గౌడ్, ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో అథ్లెటిక్స్ అకాడమీలో ఎండి గౌస్ సమక్షంలో శిక్షణ పొందుతున్నాడు ఖమ్మం రోటరీ నగర్ సెంచరి హై స్కూల్ నందు విద్యను అభ్యసించుచున్నాడు ఈ బహుమతులను ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి శర్మ , డి వై ఎస్ ఓ సునీల్ కుమార్ రెడ్డి , అథ్లెటిక్స్ కోచ్ ఎండి గౌస్ అసోసియేషన్ సెక్రెటరీ ఎండి షఫీ, సింగరాయపాలెం పిఈటీ ఏ న్ వెంకటేశ్వర్లు ల చేతులు మీదుగా ప్రశంస పత్రములు మెడల్స్ ను అందుకున్నాడు గురువారం కొనిజర్ల తాసిల్దార్, ఎంపీడీవో, విద్యాశాఖ అధికారి, కొనిజర్ల మండల సీఎం కప్ క్రీడల కన్వీనర్ ఫిజికల్ డైరెక్టర్ యుటిఎఫ్ రంజాన్ పెద్ద మునగాల హై స్కూల్ హెడ్మాస్టర్ కృష్ణయ్య ఫిజికల్ డైరెక్టర్ గుమ్మిడేల్లి రాంబాబు పంచాయతీ కార్యదర్శి సుధీర్ ఖమ్మం సెంచరీ హై స్కూల్ ప్రిన్సిపల్ ప్రభాకర్ స్కూల్ పి ఈ టి వీరబాబు మరియు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు మండల నాయకులు తదితరులు అభినందించారు.


Comments