దొడ్డి కొమరయ్య ఆశయాల సాధనకు గొల్లకురుమలు ఐక్య పోరాటాలు చేయాలి
జిఎంపిఎస్ జిల్లా నాయకులు
జనగామ, తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన దొడ్డి కొమరయ్య 79వ వర్ధంతిని గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం (జిఎంపిఎస్)జనగామ జిల్లా కమిటీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా కమిటీ నాయకులు దొడ్డి కొమరయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు.
జిల్లా అధ్యక్షుడు మోటే దేవేందర్ మాట్లాడుతూ, నైజాం పరిపాలన వ్యతిరేకంగా పోరాడి, విసునూర్ తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు అర్పించిన తొలి అమరుడిగా దొడ్డి కొమరయ్య తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని గుర్తుచేశారు. 1946 జూలై 4న నైజాం అల్లరి మూకలు విసునూర్ గ్రామంపై దాడి చేసిన సమయంలో, ప్రజలంతా ఏకమై విప్లవ పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు.
దొడ్డి కొమరయ్య వీర మరణంతో తెలంగాణ సాయుధ పోరాటం మరింత ఉధృతమైందని, విద్యార్థుల సహా అనేకమంది యువకులు ఆయుధాలదీనంగా ఉద్యమంలో చేరారని వివరించారు. ప్రజలు తమ హక్కుల కోసం రజాకర్లను ఎదుర్కొంటూ పోరాటపథంలోనిలిచారని చెప్పారు. 
ఇప్పటికీ దొడ్డి కొమరయ్య ఆశయాలు పూర్తిగా నెరవేరలేదని, ఇవి సాధించాలంటే జిల్లాలోని గొల్లకురుమలు ఐక్యంగా ఉద్యమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. “మన జనాభా ప్రతిపత్తి మేరకు చట్టసభల్లో మన ప్రతినిధులు ఉండేలా పోరాడాలి. ప్రభుత్వాల పైన ఒత్తిడి తెచ్చేలా ఐక్యతతో ఉద్యమాలు జరపాలి,” అని మోటే దేవేందర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గుండా వెంకటయ్య, జనగామ టౌన్ అధ్యక్షుడు ఉలిగిల్ల చంద్రయ్య, దేవరుప్పుల మండల అధ్యక్షుడు బుమాండ్ల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.


Comments