గ్రూప్ వన్ లో సత్తా చాటిన గోవిందాపురం (ఏ) గ్రామ వాసి
రాష్ట్రంలో 92వ ర్యాంకుతో 'డీపీఓ' పోస్ట్ సాధించిన భాగం నిఖిల రామచంద్ర
ఖమ్మం బ్యూరో, సెప్టెంబర్ 28, తెలంగాణ ముచ్చట్లు;
బోనకల్ మండల పరిధిలోని గోవిందాపురం ఏ గ్రామ వాసి, భాగం రాము, గీతాదేవి ల కుమార్తె(భాగం నారాయణరావు నిర్మలాదేవి మనవరాలు) భాగం నిఖిల గ్రూప్ వన్ లో సత్తా చాటి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ ) పోస్ట్ సాధించింది. మొదటి మొదటి నుండి చదువుల్లో రారాణి గానే నిలిచింది. పదవ తరగతి వరకు డీఏవి పబ్లిక్ స్కూల్లో చదివి, విజయవాడ (గొల్లపూడి) నారాయణ జూనియర్ కాలేజీలో 98% మార్కులతో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసింది. నారాయణ ఐఏఎస్ అకాడమీలో 90% మార్కులతో కాలేజ్ టాపర్ గా డిగ్రీ పట్టా అందుకుంది. దూరవిద్య ద్వారా ఎంఏ సోషియాలజీ పూర్తి చేసిన నిఖిల యుజిసి నెట్ రాసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ సాధించారు. తాజాగా వెలువడిన గ్రూప్ వన్ ఫలితాలలో స్టేట్ 92వ ర్యాంకు సాధించి డీపీఓ పోస్ట్ సాధించారు. ఆమె విజయం పట్ల గోవిందాపురం ఏ గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు భాగం నాగేశ్వరరావు, భాగం పాపారావు భాగం నిఖిల డిపిఓ పోస్ట్ సాధించటం గోవిందాపురం ఏ గ్రామానికి గర్వకారణం అని అన్నారు. గ్రామస్తులు, మండల అధికారులు అభినందనలు తెలిపారు


Comments