హోమీ జే. బాబా 116వ జయంతి వేడుకలు
ఏ ఎస్.రావు నగర్, అక్టోబర్ 30 ( తెలంగాణ ముచ్చట్లు):
భారత అణు పితామహుడు డాక్టర్ హోమీ జే. బాబా 116వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో కమలానగర్ కార్యాలయంలో గురువారం సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరి రావు అధ్యక్షత వహించారు.డాక్టర్ బాబా చిత్రపటానికి ఎన్ఎఫ్సీ సీనియర్ నాయకులు ఉదయ భాస్కర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన ఆయన భారత అణు రంగ అభివృద్ధిలో డాక్టర్ బాబా పాత్ర అపారమని కొనియాడారు. అణు పరిశోధనలో భారతదేశానికి శాశ్వత పునాదులు వేసిన శాస్త్రవేత్తగా ఆయనను గౌరవించాలన్నారు.ఈ సందర్భంగా స్ఫూర్తి గ్రూప్ నాయకులు కృష్ణమాచార్యులు మాట్లాడుతూ జీవితాంతం అణు శక్తి, పరిశోధన రంగాల అభివృద్ధికి కృషి చేసిన మహానుభావుడే హోమీ జే. బాబా అని పేర్కొన్నారు. దేశ రక్షణ, అణు విద్యుత్ రంగాలకు ఆయన చేసిన కృషి అమోఘమని చెప్పారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీతగా దేశానికి గౌరవం తెచ్చేలా పనిచేశారన్నారు.కార్యక్రమంలో జి. శివరామకృష్ణ, ఎం. భాస్కర్ రావు, గిరీష్, గొడుగు యాదగిరి రావు తదితరులు మాట్లాడారు. అనంతరం సభ్యులందరూ హోమీ జే. బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జె. చంద్రశేఖర్ రావు, ఎం. శ్రీనివాస్ రావు, ఎం. శ్రీనివాస్, అశోక్, శోభ, గౌసియా, ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Comments