మానవ జన్మ ఉత్తమమైనది 

మానవ జన్మ ఉత్తమమైనది 

ఐటీడీఏ పిఓ బి రాహుల్

భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు: 

   ప్రపంచంలో అన్ని జీవరాశుల కంటే ఉత్తమమైనది మానవ జన్మని, అందులో ముఖ్యమైనది సర్వేంద్రియానం నయనం ప్రధాన మైనవని, ప్రపంచాన్ని చూసేది అంచనా వేసేది కళ్ళతోనే కాబట్టి నిరుపేదలైన గిరిజనులకు ప్రపంచాన్ని చూసేటట్లు సేవలందిస్తున్న లైన్స్ క్లబ్, రెడ్ క్రాస్, మారుతి నర్సింగ్ కళాశాల సభ్యులకు ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. 
        శనివారం నాడు భద్రాచలంలోని మారుతి నర్సింగ్ కళాశాల ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, పుష్పగిరి కంటి ఆసుపత్రి సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాలలో నిరుపేదలైన గిరిజనులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయించి దానికి తగ్గట్లు సౌకర్యాలు కల్పించడం చాలా సంతోషకరమని, మానవసేవే మాధవసేవ అన్న సూక్తిని మారుతి నర్సింగ్ కళాశాల విద్యార్థినిలు మరియు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు వారికి లైన్స్ క్లబ్ సభ్యులు సహకారం అందించడంతో మారుమూల ప్రాంత 150 గిరిజన గ్రామాలలో తిరిగి కంటి సమస్యతో బాధ పడుతున్న వారిని గుర్తించి వారికి కంటి పరీక్షలు చేసి చూపు తెప్పించి ప్రపంచాన్ని చూసే విధంగ కృషి చేస్తున్న సభ్యులను గిరిజనులు జీవితాంతం తలుచుకుంటారని అన్నారు. మారుతి నర్సింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినిలు చదువుతోపాటు ఇటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొని గిరిజనులకు సేవలందించాలని అన్నారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకవర్గం సభ్యుడు ఇవి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత సంవత్సరం నవంబర్ ఆరో తారీకు నుండి ఫిబ్రవరి 15వ తారీకు వరకు అనగా 102 రోజులలో 26 క్యాంపులు ఏర్పాటు చేసి  1075 మంది  నిరుపేద గిరిజనులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి రెడ్ క్రాస్ సొసైటీ వారి సొంత ఖర్చులతో హైదరాబాద్ కంటి ఆపరేషన్లు చేయించి తిరిగి వారి గమ్యస్థానాలకు జరిగిందని అన్నారు.
       అనంతరం డాక్టర్ ఎస్ ఎల్ కాంతారావు మాట్లాడుతూ కార్యక్రమానికి ఉచిత కంటి వైద్య శిబిరం కార్యక్రమం విజయవంతం అవ్వడానికి అహర్నిశలు సేవలందించిన లైన్స్ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కళాశాల ఫ్యాకల్టీలు, విద్యార్థినిలకు మరియు వాలంటీర్లకు అభినందిస్తూ ఎటువంటి సేవా కార్యక్రమాలలో పాల్గొని గిరిజనులకు మరిన్ని సేవలు అందించాలని అన్నారు. 
    WhatsApp Image 2025-02-15 at 8.24.41 PM (1)  అనంతరం ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం అవ్వడానికికృషిచేసిన డైరెక్టర్లకు, మారుతి నర్సింగ్ కళాశాల ఫ్యాకల్టీలకు, ఇబ్బందికి, విద్యార్థినిలకు ప్రోత్సాహకాలు అందించారు. 
        ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఏ డి ఎం హెచ్ ఓ చైతన్య, రెడ్ క్రాస్ మరియు లైన్స్ క్లబ్ సభ్యులు సూర్యనారాయణ, సిద్ధులు, సంజీవరావు, శ్రీనివాసరెడ్డి, కామేశ్వరరావు, వెంకట పుల్లయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .