భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు: వరకట్న వేధింపులు తాళలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ఆరు నెలల క్రితం గోవాలో దేవిక (35), సతీష్ వివాహం జరిగింది. రాయదుర్గంలోని ప్రశాంతి హిల్స్ లో నివసిస్తున్న వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని దేవిక మృతి చెందింది.

సోమవారం ఉదయం 10 గంటల సమయంలో దేవిక ఉరివేసుకున్నట్లు గుర్తించిన భర్త సతీష్, పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని, భర్త వరకట్న వేధింపులే తన కూతురి మృతికి కారణమని దేవిక తల్లి రామలక్ష్మి పోలీసులకు ఫిర్యాదుచేసింది. WhatsApp Image 2025-03-04 at 12.16.11 PM

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .