ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి
అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి
Views: 5
On
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12వ తేదీలోపు తెలియజేయాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి రాజకీయ పార్టీలను కోరారు.
మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టర్ పర్యవేక్షణలో ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా రూపొందించబడిందని తెలిపారు. ఈ నెల 7వ తేదీన అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ఈ జాబితాను ప్రకటించామని, జిల్లాలో 1986 పోలింగ్ కేంద్రాలను గుర్తించి ముసాయిదా జాబితాను తయారు చేశామని వివరించారు.
అభ్యంతరాల నివేదన ప్రక్రియ:
• ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12వ తేదీలోపు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశాలలో నివేదించవచ్చని వివరించారు.
• ఈ నెల 13న అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించనున్నట్లు చెప్పారు.
• తుది జాబితాను ఈ నెల 17న అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డీపీఓ లక్ష్మి రమాకాంత్, కాంగ్రెస్ ప్రతినిధులు ఇ.వి. శ్రీనివాస్ రావు, బీజేపీ నుంచి నిశాంత్, ఎంఐఎం ఫైజుల్లా, వైఎస్సార్‌సీపీ రజినీకాంత్, టీడీపీ కుసుమ శ్యామ్ సుందర్, సీపీఎం వెంకట్ తదితర రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments