జర్నలిస్టులపై కేసు నమోదు విషయంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి 

-రాజన్న సిరిసిల్ల ఎస్ పి కి ఫిర్యాదు చేసిన ఎన్ యుజెఐ, టిఎస్ జెయు నేతలు

జర్నలిస్టులపై కేసు నమోదు విషయంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి 

వేములవాడ,తెలంగాణ ముచ్చట్లు:

యూసుఫ్ అనే వ్యక్తి తనపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ చేసిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ చేయకుండానే వేములవాడ టౌన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ చేసిన కేసు నమోదుపై సంపూర్ణ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్ యుజెఐ జాతీయ ఉపాధ్యక్షులు నారగౌని పురుషోత్తం, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (టీఎస్ జెయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ నాయకత్వంలో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పించారు. యూసుఫ్ ఫిర్యాదుతో టీఎస్ జెయు నాయకులు కొల్లూరి శ్రీనివాస్, బాలకృష్ణ, గున్నాల నరేష్, ఖమ్మం రమాకాంత్, కోలగాని చందు, దూస రాజేందర్ లపై కేసు నమోదు చేశారని వారు వివరించారు. అక్రమంగా నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. యూసుఫ్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వివరించారు. ఈ మేరకు జిల్లా ఎస్ పి  సానుకూలంగా స్పందించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎస్ జెయు నాయకులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .