సిఎం  రేవంత్ రెడ్డి చేతులమీదుగా కాలోజి కళాక్షేత్రం ప్రారంభం

ప్రజా కవి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి 

సిఎం  రేవంత్ రెడ్డి చేతులమీదుగా కాలోజి కళాక్షేత్రం ప్రారంభం

 

👉4601.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభం 

👉 ఆర్ట్ గ్యాలరీ సందర్శన

👉 కాళోజి పై నిర్మించిన లగు  చిత్రన్ని విక్షించిన ముఖ్యమంత్రి 

హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:IMG-20241119-WA0028

అద్భుతం ఆవిష్కృతమైంది కలలు కళాకారులకు పుట్టినిల్లుగా పేరుగాంచిన ఓరుగల్లు కళామతల్లి శిఖలో మరో మణిహారం తోడిగారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 
జిల్లా ప్రజలు కళాకారులు కళాభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కాళోజి కళాక్షేత్రం  మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  
అంతకుముందు పోలీసు గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు.
 ముఖ్యమంత్రి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం  నుండి హనుమకొండ కూడా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 2.30 కి చేరుకున్నారు. అక్కడ నుండి నేరుగా కాళోజి కళాక్షేత్రానికి చేరుకొని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తో కలిసి ముందుగా ప్రముఖ కవి కాళోజి నారాయణరావు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం హనుమకొండ వరంగల్ జిల్లాలకు సంబంధించిన 4601.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపణలు ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి  అక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్ ద్వారా చేశారు. అనంతరం కలాక్షేత్ర  భవనాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అక్కడ నుండి నేరుగా కాళోజీ కళాక్షేత్ర భవన క్రింది అంతస్తు లో  కాలోజి నారాయణరావు  వ్యక్తిగత జీవితంలోని ప్రత్యేక క్షణాలను ప్రతిబింబించే ఫోటోలు, పురస్కారాలు, వ్యక్తిగత వస్తువులు ప్రదర్శించిన ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు.  ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీ ని ముఖ్యమంత్రి సందర్శించారు.  ఈ సందర్భంగా కాళోజి ఫౌండేషన్ ప్రతినిధులు వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాస్ రావులు ముఖ్యమంత్రికి  కాళోజి జీవితం అక్కడి వస్తువుల గురించి వివరించగా ముఖ్యమంత్రి ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆడిటోరియం లో కాళోజి జీవిత విశేషాలతో నిర్మించిన లఘ చిత్రాన్ని కాళోజి ట్రస్ట్ ఫౌండేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి విక్షించారు.  ఈ సందర్బంగా ప్రముఖ రచయిత అంపషయ్య నవీన్  ట్రస్ట్ సభ్యులు ముఖ్యమంత్రికి  పుష్పగుచం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆడిటోరియం బయట ఇందిరా ఫెలో షిప్ సభ్యులు, స్థానికి పార్టీ ప్రజా ప్రతినిధులను ముఖ్యమంత్రి కలిశారు. అక్కడ నుండి నేరుగు ఆర్ట్స్ కళాశాల మైదానం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మధ్యాహ్నం 3.35 ని బయలుదేరారు.

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన వివరాలు:

కాళోజి కళాక్షేత్రం ప్రారంభం - 90  కోట్లు  
అండర్ డ్రైనేజీ వ్యవస్థ శంఖుస్థాపన - 4170  కోట్లు 
నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభం - 12  లక్షలు 
నయీమ్  నగర్ బ్రిడ్జి ప్రారంభం - 8.30 కోట్లు
వరంగల్ తూర్పు అభివృద్ధి పనుల శంకుస్థాపన - 3  కోట్లు
పాలిటెక్నిక్ కళాశాల శంఖుస్థాపన - 28  కోట్లు
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఆర్ & ఆర్ లేఔట్, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు శంఖుస్థాపన  - 863  ప్లాట్లు, 5 లక్షల @ 43.15 కోట్లు  
ఫ్లడ్ డ్రైనేజీ సిస్టం శంఖుస్థాపన - 160.3 కోట్లు 
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ టౌన్షిప్ ఆవరణలో  పిహెచ్సి , ప్రైమరీ స్కూల్, పశు వైద్యశాల శంకుస్థాపన - 13  కోట్లు 
వరంగల్ పట్టణం రహదారుల అభివృద్ధి శంకుస్థాపన  - 49.50 కోట్లు
పరకాల నుండి ఎర్రగట్టు గుట్ట రోడ్డు  4  లైన్ల విస్తరణ - 65.0 కోట్లు
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో మౌలిక సాధుపాయల కల్పనకు శంకుస్థాపన  – 11.6 కోట్లు
వరంగల్ ఎల్ బి నగర్ లో ఉర్ధు భవనం శంకుస్థాపన – 1.50 కోట్లు

ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్, గిరిజన శాఖ మంత్రి ధనసరి అనసూయ, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రవాణా, బీసీ వెల్ఫేర్పొన్నం ప్రభాకర్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ రాజకీయ సలహాదారు కె. కేశవరావు, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి అజిత్ రెడ్డి,  ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మధుసూధనాచారి, గ్రేటర్ వరంగల్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవురి ప్రకాష్ రెడ్డి, కె ఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, కూడా చైర్మన్ ఇనుగాలా వెంకట్రాంరెడ్డి, ఎంఏ యుడి ప్రిన్సిపాల్ సెక్రెటరీ దానా కిషోర్, రోడ్ల భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, సమాచార శాఖ కమిషనర్ డాక్టర్ హరీష్, విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, వరంగల్, హన్మకొండ కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, ప్రావీణ్య, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడేలు ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .