సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మోటిక్స్ చార్జీల పెంపు ప్రారంభం

సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మోటిక్స్ చార్జీల పెంపు ప్రారంభం


WhatsApp Image 2024-12-14 at 4.07.30 PM

హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో డైట్, కాస్మోటిక్స్ చార్జీల పెంపు కార్యక్రమం హసన్పర్తి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, కళాశాల (గర్ల్స్)లో ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ ఇన్‌చార్జ్ కలెక్టర్ సత్య శారద హాజరై కొత్త డైట్ మెనూను ఆవిష్కరించారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఎస్ఓపీ హ్యాండ్‌బుక్‌ను కూడా విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, 8 ఏళ్ల తర్వాత డైట్ చార్జీలు, 16 ఏళ్ల తర్వాత కాస్మోటిక్స్ చార్జీల పెంపు జరిగిందని చెప్పారు. మంచి ఆహారం అందిస్తేనే విద్యార్థుల ఆరోగ్యం, చదువులో ఆసక్తి పెరుగుతుందని అన్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళల కోసం పోటీ పరీక్షల్లో 33% రిజర్వేషన్ కల్పించడమే కాకుండా పాఠశాలలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ అశోక్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అరుణ, తహసీల్దార్ ప్రసాద్,
ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .