బిజెపి కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం అందరి బాధ్యత.. 

బిజెపి కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

.బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు. 

ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

భారతీయ జనతా పార్టీ  ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కార్యాలయంలో  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ ఈ రోజు మనకు కేవలం పండుగ రోజు మాత్రమే కాదు, దేశం కోసం త్యాగం చేసిన మహానుభావుల త్యాగాన్ని స్మరించుకునే పవిత్ర సందర్భం. 79 ఏళ్ల క్రితం మన దేశం ఆంగ్లేయ శాసనాల బంధనాల నుంచి విముక్తి పొందింది అన్నారు. ఆ స్వేచ్ఛను సాధించడానికి అనేకమంది వీరులు తమ ప్రాణాలను అర్పించారు. సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్,  చంద్రశేఖర్ ఆజాద్ , వీర సవార్కర్  వంటి మహనీయులు మనకు స్వతంత్ర్యం అనే వరాన్ని అందించారన్నారు.

స్వాతంత్ర్యం పొందిన తర్వాత దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ప్రతి పౌరుడి బాధ్యత. భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ దేశ సమగ్రత, అభివృద్ధి, జాతీయ భద్రత కోసం కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ  నాయకత్వంలో సబ్కా సాథ్ – సబ్కా వికాస్ – సబ్కా విశ్వాస్ – సబ్కా ప్రయత్న్ అనే నినాదంతో దేశం ముందుకు సాగుతోందన్నారు.
ఈ రోజు మనం దేశభక్తిని కేవలం మాటల్లోనే కాకుండా, మన పనుల ద్వారా కూడా చాటుకోవాలి. అవినీతి, మతభేదాలు, ప్రాంతీయ విభేదాలు దూరం చేసి, అందరం కలిసి దేశ ప్రగతికి కృషి చేయాలని పిలుపునిచ్చాడు. 
ఈ కార్యక్రమంలో నాయకులు గంట్యాల విద్యాసాగర్, నున్న రవికుమార్, దొంగల సత్యనారాయణ, నల్లగట్టు ప్రవీణ్ కుమార్, తొడుపునూరి రవీందర్, పమ్మీ అనిత తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .