వర్ధన్నపేటలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నాగరాజు
వర్ధన్నపేట,తెలంగాణ ముచ్చట్లు:
వరంగల్ జిల్లా వర్ధన్నపేట టౌన్‌లోని అంబేడ్కర్ సెంటర్‌లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక వేడుకలు నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించబడిన రోజు సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలు ప్రజలకు అందించే ప్రతిష్ఠాత్మక ఘట్టంగా అభివర్ణించారు. “మన దేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దదని, అది సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రతిపాదించే గొప్ప దస్తావేజుగా నిలుస్తుందని” అన్నారు.
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యెద్దు సత్యం, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అబిడ్ రాజ్ రెడ్డి, జిల్లా నాయకులు పోశాల వెంకన్న గౌడ్, పర్వతగిరి మాజీ జెడ్పీటీసీ సంగులాల్, మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Comments