ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిధుల జమ
Views: 27
On
పెద్దమందడి,ఆగస్టు22(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల కేంద్రంలో ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద లబ్ధిదారులైన ఆవుల సుజిత, మరియు తిర్లాపురం లక్ష్మమ్మ గార్లకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మొదటి విడతగా నిధులు జమ అయ్యాయి.ఇళ్ల బేస్మెంట్ లెవల్ పూర్తి కావడంతో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 1,00,000/- (ఒక లక్ష రూపాయలు) జమ చేయడం జరిగింది.ఈ సందర్భంగా లబ్ధిదారులు పేదలను గుర్తించి వారికి ఇల్లు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దమందడి తహసిల్దార్ సరస్వతి, ఇన్చార్జ్ ఎంపీడీవో పుష్ప, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, టైలర్ రవి, రాఘవేందర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments