స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్ పి. జయప్రకాశ్ స్మరణ సభ

స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్ పి. జయప్రకాశ్ స్మరణ సభ

ఏ.ఎస్.రావు నగర్, అక్టోబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):

ఏ ఎస్ రావు నగర్ డివిజన్ లో ఈసీఐఎల్ రిటైర్డ్ ఎంప్లాయీ, రచయిత, కార్మిక నాయకుడు, సిపిఎం పార్టీ నిబద్ధ సభ్యుడు కామ్రేడ్ పి. జయప్రకాశ్ సంతాప సభను ఆదివారం కమలానగర్ సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు.సభకు సిపిఎం మేడ్చల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జి. శ్రీనివాసులు అధ్యక్షత వహించగా, ప్రధాన వక్తలుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.డి. అబ్బాస్, జిల్లా కార్యదర్శి పి. సత్యం, నాయకులు కోమటి రవి, జి. యాదగిరిరావు, శ్రీమన్నారాయణ, పి.బీ. చారి, కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎం.డి. అబ్బాస్ మాట్లాడుతూ  “జయప్రకాశ్  జీవితం కార్మికుల హక్కుల కోసం అంకితమై ఉంది. ఆయన ఈసీఐఎల్‌లో పనిచేస్తూ ప్రతిరోజు కార్మిక సమస్యలను వెలుగులోకి తెచ్చేవారు. అప్పటి రోజుల్లో సైక్లోస్టైల్ పద్ధతిలో ప్రకటనలు ముద్రించి కార్మికులకు చైతన్యాన్ని కలిగించేవారు” అని గుర్తు చేశారు.అలాగే ఆయన సామాజిక, రాజకీయ అంశాలపై 100కు పైగా వ్యాసాలు రాశారని — ఈనాడు, ఆంధ్రజ్యోతి, నవతెలంగాణ, సాక్షి పత్రికల్లో ప్రచురితమయ్యాయని తెలిపారు. అవి చైతన్యపూరితమైన రచనలు కావడంతో అనేక మందికి స్ఫూర్తిగా నిలిచాయని అన్నారు.వక్తలు మాట్లాడుతూ  “జయప్రకాశ్ నిజమైన కమ్యూనిస్టు నాయకుడు. ఆయన ఆశయాలను కొనసాగించడం మనందరి బాధ్యత” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జయప్రకాశ్ కుమార్తె ప్రీతి, అల్లుడు కేదార్, నాయకులు జే. చంద్రశేఖర్, జె. రఘవరావు, పి. గణేష్, యం. శంకర్, యం. చంద్రశేఖర్, హరిప్రసాద్, శివన్నారాయణ, సోమయ్య చారి, భాస్కర్, నరసింహ, జీవి రావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .