పెద్దమందడిలో పనుల జాతర

పెద్దమందడిలో పనుల జాతర

పెద్దమందడి,ఆగస్టు22(తెలంగాణ ముచ్చట్లు):

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం–2025లో భాగంగా పెద్దమందడి మండల పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం పలు గ్రామాల్లో పనుల జాతర కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
మండలంలోని 22 గ్రామాల్లో పూర్తైన పనులకు ప్రారంభోత్సవాలు, కొత్త పనులకు భూమి పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామసభల్లో ప్రజలకు చేపట్టబోయే పనుల వివరాలను అధికారులు తెలియజేశారు.చేపట్టబోయే 10 ముఖ్య పనులు
పశువుల షెడ్లు,గొర్ల షెడ్లు,కోళ్ల షెడ్లు,అజోలా పెంపకం,వానపాముల ఎరువుల యూనిట్లు
తో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
సన్మానాలు, మంజూరు పత్రాలు గ్రామసభల్లో ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పని దినాలు చేసిన కూలీలను, గ్రామపంచాయతీ వర్కర్లను సన్మానించారు.
అలాగే ఇప్పటికే మంజూరైన పనుల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.రూ.11.60 లక్షల విలువైన పనులు ఈ జాతరలో భాగంగా మొత్తం 11,60,584 విలువైన కొత్త పనులకు భూమిపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు, ఉపాధి హామీ ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, లబ్ధిదారులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .