సాహిత్య శిఖరం అందెశ్రీకి జర్నలిస్టుల నివాళి
ఖమ్మంలో అందెశ్రీకి టిజేఎఫ్ ఘన నివాళులు
ఖమ్మం బ్యూరో, నవంబర్ 11, తెలంగాణ ముచ్చట్లు;
ప్రజాకవి, తెలంగాణ గేయ రచయిత అందశ్రీ మరణం యావత్తు తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటును మిగిల్చిందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, జాతీయ కౌన్సిల్ సభ్యులు వెన్నబోయిన సాంబశివరావులు అన్నారు. ఖమ్మం నగరంలోని మయూరి సెంటర్లో గల అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం అందెశ్రీకి జర్నలిస్టులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అమరహై అందెశ్రీ, జోహార్ అందెశ్రీ అంటూ జర్నలిస్టులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిర్రా రవి, సాంబశివరావులు మాట్లాడుతూ.. చదువు రాకపోయినప్పటికీ అద్భుతమైన తెలంగాణ ఉద్యమ పాటలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల గేయాలు రచించి తెలంగాణ స్వరాష్ట్ర మలిదశ ఉద్యమంలో అందెశ్రీ మూలస్తంభంగా నిలిచారని కొనియాడారు. అందెశ్రీ పాటలను గుర్తించిన నేటి తెలంగాణ ప్రభుత్వం జయ జయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ జాతీయ గేయంగా గుర్తింపునిచ్చి పురస్కారం అందించడం అభినందనీయమన్నారు. అలాంటి మహాకవి అందెశ్రీ నేడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని, ఆయన ఆశయాలను, పోరాట స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తు చేశారు. నివాళులు అర్పించిన వారిలో టీజేఎఫ్ జిల్లా నాయకులు రాంశెట్టి విజేత, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీకాంత్, వనం నాగయ్య, మందుల ఉపేందర్, కలవకొలను హారీష్ రాజు, మందటి వెంకటరమణ, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, టిఎస్ చక్రవర్తి, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్ష కార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్, కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజు, జిల్లా నాయకులు తిరుపతిరావు, హుస్సేన్, గోవింద్, దూసరి కళ్యాణ్, మదర్ సాహెబ్, సాయి, సుధాకర్, గణేష్, యాదగిరి, ఉపేందర్, వంగూరి ఈశ్వరి, వుల్లోజు రమేష్, శ్రీధర్, నరేష్, ఇస్సంపల్లి వెంకటేశ్వర్లు, దండాల ప్రభాకర్ రెడ్డి,
మందా వెంకటేశ్వర్లు, శంకర్, మనోజ్, కొండలు, సతీష్, హరి, బాబు, రాజు, పెంటి వెంకటేశ్వర్లు తదితరులున్నారు.


Comments