ఎస్సీ వర్గీకరణపై ప్రతిపాదనలు సమర్పించిన అనంతపురం కమలేష్

ఎస్సీ వర్గీకరణపై ప్రతిపాదనలు సమర్పించిన అనంతపురం కమలేష్

హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:

తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌కి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ  యువ నాయకుడు అనంతపురం కమలేష్ ప్రతిపాదనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని, రిజర్వేషన్లను ఎస్సీ లోని 59 కులాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయించాల్సిన అవసరం ఉందని సూచించారు.మాదిగ కులం ఉమ్మడి రిజర్వేషన్లలో తీవ్ర నష్టపోయిందని, ఎస్సీ జనాభాలో 70 శాతం ఉన్న మాదిగలకు రిజర్వేషన్లలో 70 శాతం వాటా ఇవ్వాలని కమలేష్ డిమాండ్ చేశారు. అలాగే మాదిగలను ఒక గ్రూపు, మాలలను ఒక గ్రూపు, ఉప కులాలను మరో గ్రూపుగా విభజించి, వారి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు.ఈ ప్రతిపాదనలు ఎస్సీ వర్గీకరణ కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్‌కు వినతిపత్రం ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో తాటికాయల రఘు, కొంగ రాజు, కృష్ణ తేజ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .