ఘనంగా భక్తిశ్రద్ధలతో కార్తీక సోమవారం పూజలు
వల్భాపూర్ శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో విశేష వేడుకలు
-- శ్రీ పశుపతినాథ్ స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి.
ఎల్కతుర్తి, అక్టోబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
కార్తీకమాస సోమవారం సందర్భంగా వల్భాపూర్ గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవస్థానంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఉదయం 6 గంటలకు గణపతి పూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పంచామృత రుద్రాభిషేకాలు, సామూహిక అభిషేక–అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మొక్కలు చెల్లించుకుంటూ, దీపాలు వెలిగిస్తూ భక్తి వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి (ధూపదీప నైవేద్య సంఘం ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు) నేతృత్వంలో నిర్వహించారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గంజి భావనఋషి, సభ్యులు శ్రవణ్ కుమార్, లింగారావు, విష్ణుమూర్తి, తరుణ్, విజయ్, మహేందర్, విజయశ్రీ, మమత, శ్రీదేవి, స్వరూప, రజిత, వీణ శ్రీతో పాటు అనేకమంది భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments