మరుగుదొడ్ల నిర్వహణపై అవగాహన
తాటికాయల గ్రామంలో కేంద్ర బృందం పర్యటన
Views: 16
On
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు:
“మరుగుదోడ్డే కానీ అది మా ఆత్మ గౌరవం నిలిపే నిలయం” అనే నినాదంతో, జిల్లా కలెక్టర్, పంచాయతీ రాజ్ మరియు
రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు, వరల్డ్ టాయిలెట్స్ డే ను (నవంబర్ 19 నుండి డిసెంబర్ 10 వరకు ) నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామంలో ప్రత్యేక కేంద్ర బృందం బుధవారం పర్యటించింది.
మరుగుదొడ్ల యొక్క నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించి, వాటి సరైన వాడకం కోసం మార్గనిర్దేశం చేశారు.
ఈ పర్యటనలో సెంట్రల్ టీం సభ్యులు మరుగుదొడ్ల నిర్వహణ మరియు వాటి వాడకం పై గ్రామస్తులతో ముచ్చటించి, అవగాహన పెంచేందుకు ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీ.ఆర్.డి.ఓ శ్రీనివాస్ రావు, మండల ఎం.పి.డీ.ఓ అనిల్, స్వచ్ఛ భారత్ మిషన్ కోఆర్డినేటర్ సంపత్ కుమార్,పంచాయితి కార్యదర్శి చామంతి,ఏ.పి.ఓలు, కేంద్ర బృందం పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments