సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కొలిపాక సతీష్

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కొలిపాక సతీష్

ఘనపూర్,తెలంగాణ ముచ్చట్లు: 
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజల కోరికను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంఘీభావంగా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ కొలిపాక సతీష్  సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
 
కొలిపాక సతీష్ విమర్శలు:
 
• ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తరువాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల అవసరాల కంటే తమ కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేసిందని అన్నారు.
• కేసీఆర్ హయాంలో అనేక అవినీతి, ప్రజా నిధుల దుర్వినియోగం జరిగిందని, ప్రజలు వీరిపై విసుగెత్తారని అన్నారు.
• తెరాస ఇచ్చిన హామీలన్నీ పక్కదారి పట్టి, దళితులకు భూములు, ఇంటికొక ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లాంటి హామీలు అమలు కాలేదని ఆరోపించారు.
 
కాంగ్రెస్ విజయాలు:
 
• కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ఒకే ఏడాదిలోనే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్ రూ. 500కు అందజేసి, రైతుల రుణమాఫీ చేయడం జరిగింది.
• విద్యా మరియు వైద్య రంగాలలో ఆర్టీసీ విద్యార్థులకు ఉచిత బస్సు పాస్, ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షల రూపాయల వరకు పెంచడం వంటి చర్యలు తీసుకున్నామని తెలిపారు.
• రేషన్ కార్డుల పంపిణీతో పాటు ఇందిరమ్మ ఇళ్లను త్వరలో అర్హులైన వారికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
 
రాబోయే 9 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మేకల మల్లేశం, మామిడ్ల శ్రీనివాస్, గట్టు మనోహర్, యూనిస్ ఖాన్, సృజన్, రాహుల్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .