ఖమ్మంలో కదులుతున్న రైలులో ప్రత్యక్షమైన కొండ చిలువ

ఖమ్మంలో కదులుతున్న రైలులో ప్రత్యక్షమైన కొండ చిలువ

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 29, తెలంగాణ ముచ్చట్లు;

ఖమ్మం లో కొండ చిలువ కలకలం రేపింది. కదులుతున్న రైలులో ఓ కొండ చిలువ ప్రయాణీకులను భయభ్రాంతులకు గురిచేసింది. రైల్వే పోలీసులు సకాలంలో స్పందించి కొండ చిలువను పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వరంగల్ నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎస్ 2  ఏసీ బోగీలో మూత్రశాల వద్ద కొండ చిలువను చూసిన ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. బిగ్గరగా కేకలు పెట్టారు. టిటిఇ అక్కడకు చేరుకుని పామును గుర్తించి సమీప రైల్వే స్టేషన్ ఖమ్మం ఆర్‌పిఎఫ్ పోలీసులకు సమాచారం అందించాడు. వారు ఖమ్మం నగరానికి చెందిన పాములు పట్టే మస్తాన్ అనే వ్యక్తిని పిలిపించారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌లో రైలు ఆగగానే రైల్వే పోలీసులు మస్తాన్ బోగి వద్దకు వెళ్లి కొండ చిలువను పట్టుకున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!