ప్రజల ఆవేదన వినండి  ఎన్నికలు పక్కనపెట్టి సహాయక చర్యలు చేపట్టండి

ఈటల రాజేందర్ డిమాండ్

ప్రజల ఆవేదన వినండి  ఎన్నికలు పక్కనపెట్టి సహాయక చర్యలు చేపట్టండి

హైదరాబాద్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):

తుఫాన్ కారణంగా తెలంగాణ రైతులు తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. సీఎం దండాలు వసూలు పక్కనపెట్టి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఈటల రాజేందర్ మాట్లాడుతూ తాజా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి, వరి, మక్క పంటలు దెబ్బతిన్నాయని, గత వర్షాలకే రోడ్లు దెబ్బతిన్నా ఇప్పటివరకు మరమ్మతులు చేయలేదని అన్నారు. “భీమదేవరపల్లి మండలంలో 41 సెంటీమీటర్ల వర్షం పడింది. వరంగల్‌లో పలు ప్రాంతాలు ఆరు అడుగుల నీటిలో మునిగిపోయాయి. రైతులు కన్నీళ్లతో ఉన్నారు, గ్రామాల్లో విషాదం నెలకొంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి స్వయంగా ప్రజలను ఆదుకుంటున్నారని, కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అధికార రాజకీయాలకే పరిమితమైందని అన్నారు.ఈటల డిమాండ్లు:
పంట మరియు ఇళ్ల నష్టాన్ని వెంటనే అంచనా వేయాలి .నష్టపోయిన రైతులకు, కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలి.
వర్షం వల్ల కోల్పోయిన గృహోపకరణాలకూ పరిహారం కల్పించాలి.అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని పక్కనపెట్టి తుఫాన్ బాధితులకు సహాయం చేయాలి
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై విమర్శలు:రాష్ట్ర ప్రభుత్వం పది వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి ఉంచిందని ఈటల ఆరోపించారు. “డబ్బులు ఇవ్వడం లేదని కళాశాలలు విద్యార్థులను వేధిస్తున్నాయి. పేద విద్యార్థులు పై చదువులు కొనసాగించలేని స్థితి వచ్చింది,” అని తెలిపారు. కాలేజీలపై బెదిరింపు చర్యలు మానుకుని వెంటనే బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.సీఎం పై తీవ్ర విమర్శలు:ప్రజా సమస్యలు పక్కనబెట్టి అంతర్గత గొడవలు, రాజకీయ దందాలలో మునిగిపోయారని ఈటల మండిపడ్డారు.“అధికారం శాశ్వతం కాదు. ప్రజలు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారని అనొద్దు — సమయం వచ్చినప్పుడు వారు సమాధానం చెబుతారు,” అని హెచ్చరించారు.
రైతులు, విద్యార్థులు, గ్రామపంచాయతీ ప్రతినిధులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఈ సమయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!