టెన్షన్ బతుకులు!

టెన్షన్ బతుకులు!
***************
భగవంతునికి 
భక్తునికి అనుసంధానం 
అగర్ బత్తీలు కాదు!
పాపపుణ్యాలు!

పాపం పోవాలంటే 
పుణ్యం చెయ్యాలి!
పుణ్యం కావాలంటే 
పూజలు చెయ్యాలి!

పూజలు అనేకరకాలు
నవగ్రహపూజలు
కార్తీకదీపారాధనలు
కోటిదీపోత్సవాలు!

అన్న ప్రాసాదాలు
దివ్య సందేశాలు
శివరాత్రి జాగారాలు
ఏకాదశి ఉపవాసాలు!

ఇంకా చాలా ఉన్నాయి
అన్నీ రాయగలమా?
ఈ కాగితం చాలదు!
మీకే బాగా తెలుసు!

ఈ రోజు ఆ భక్తుడు
ఏదోపాపం చేసాడు!
టెన్షన్ తో ఉన్నాడు!
అర్ధరాత్రి వచ్చాడు!

ఎప్పుడుతెల్లారుతుంది?
నిద్రరావటం లేదు!
పొడికళ్ళు పడ్డాయి!
'పాపం' వేదిస్తోంది!

తప్పులుమానవసహజం
అంటారుగాని -తప్పులు 
వ్యవస్థాగత లోపాలు!
మనిషినిక్రుంగదీస్తున్నాఇ

రోజూ చేసే పాపాలే!
ఈ రోజు కాస్త ఎక్కువ!
ఏం చేసాడో పాపం!
టెన్షన్ తో ఉన్నాడు!

బతుకులు అలాంటివి!
అమాయకులపై హింస!
తుచ్ఛమైనజీవితాలు
ఎవడి ముల్లె కాజేశాడో!

సంపాదించాలి!
బాగా సంపాదించాలి!
పక్కోడికంటే ఎక్కువ!
కోట్లకు పడగలెత్తాలి!

ఇంతకంటే పాపాలు
ఇంకేమైనా ఉంటాయా?
లోపల ఏదో ఆతృత!
చెప్పలేని ఆవేదన!

రోజూ ఇదే టెన్షన్!
టెన్షన్ తో బి పి,షుగర్లు!
గుండె దడ, ఆయాసం!
చివరకు తెల్లారింది!

గుడిలో గణ గణ!
గుండెల్లో దడ దడ!
లేవాలనే ప్రయత్నం!
లేవలేకపోతున్నాడు!

ఏమో ఏం జరిగిందో!
అది ఎంత పాపమో!
భక్తునికి భగవంతునికి
అనుసంధానమైనది!

అగర్ బత్తీలు కాదు
పాప పుణ్యాలు!
ఏదో పెద్ద పాపమే!
బతుకుతెల్లారిపోయింది!
        

-తమ్మినేని అక్కిరాజు
       హైదరాబాద్

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .