వైభవంగా వెండి కవచ అలంకరణ మహోత్సవం
వనపర్తి జిల్లా ప్రతినిధి తెలంగాణ ముచ్చట్లు:
కొత్తకోట పట్టణం లోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలోని వాసవీ మాత సహిత శ్రీ లక్ష్మీ , శ్రీ సరస్వతీ మాత అమ్మవార్లకు శ్రావణ మాసం చివర శుక్రవారం సందర్భంగా వనపర్తి జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి గుంత మౌనిక మల్లేష్ , కొత్తకోట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ గుంత సురేష్ , ఆర్యవైశ్య మండల మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి కొండ స్వప్న శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో దేవాతా మూర్తులకు వెండి చీరలను అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ రోజు ఉదయం ప్రాతః కాల సమయం లొనే ముగ్గురు అమ్మవార్లకు పంచామృతాలతో ప్రత్యేక అభిషేఖాలు నిర్వహించి , దాదాపు 20 కేజీల వెండితో స్వర్ణకారులచే చేయించిన ముగ్గురు అమ్మవార్ల వెండి కవచాలను ఆలయం వరకు శోభయాత్రగా తీసుకుని వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు , హోమాలు నిర్వహించి అమ్మవార్లకు అలంకరించడం , అమ్మవారికి యెంతో ప్రీతిపాత్రమైన అరుదుగా లభించే కదంభ పుష్పాలు , కలువ పూలచే అలంకరించి పూజాకార్యక్రమాలు నిర్వహించడం జరిగింది .ప్రత్యేక ఆకర్షణగా అష్టలక్ష్మీ మండపాల అలంకరణ
నేటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చినవారు వాసవీ మాత సహిత , అష్టలక్ష్మీ మండపాలను రకరకాల పుష్పాల చేత అలంకరణ అందరినీ ఆకట్టుకోవడం తో ప్రత్యేకత ఏర్పడింది ఈ మండపాల అలంకరణ దాతలు విశ్వనాథం లక్ష్మీ వేంకటరమణ గారు ముందుండి ఏర్పాట్లను చూసుకున్నారు.కార్యక్రమంలో అమ్మవారి వెండి చీరలను సహకరించిన దాతలను సన్మానించి అమ్మవారి ఆశీర్వాదములతో పాటు ప్రసాదం అందజేయడం జరిగింది .నేటి పూజా కార్యక్రమాలు అన్నదాతలుగా మరియు అల్పాహార దాతలుగా మెడిశెట్టి జ్యోతి శ్రీనివాసులు , గుంత సహన సురేష్ గారు ఏర్పాటు చేశారు.ఇట్టి పూజా కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీమతి కవిత గారు పాల్గొని అమ్మవారు ఆశీర్వాదం తీసుకున్నారు పూజా కార్యక్రమాలలో పట్టణ ఆలయ కమిటీ సభ్యులు గుంత మల్లేష్ , విశ్వనాథం గంగాధర్ , భీమ బాలకృష్ణ , కండే నరేష్ , అర్థం అనిత తదితర మహిళలు పాల్గొన్నారు.


Comments