ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి

ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలి

-- డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏఐపిసి అధ్యక్షులు

వనపర్తి,డిసెంబర్20(తెలంగాణ ముచ్చట్లు):

ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించినందుకు వ్యతిరేకంగా టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏఐపిసి అధ్యక్షులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి  పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ ఆదిత్య రెడ్డి  మాట్లాడుతూ..ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతున్నారని, అలాంటి ప్రజాప్రయోజన పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు.
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహానీయుడు మహాత్మా గాంధీ  పేరు ఉపాధి హామీ పథకానికి గౌరవాన్ని తీసుకువచ్చిందని, అలాంటి మహానుభావుని పేరును తొలగించడం సమంజసం కాదని అన్నారు. మహాత్మా గాంధీ స్వరాష్ట్రం గుజరాత్ అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అన్యాయమని మండిపడ్డారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదన్న విషయం దేశ ప్రజలందరికీ తెలుసునని అన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకంలో యథాతథంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐపీసీ వివిధ విభాగాల రాష్ట్రాధిపతులు సందీప్ భూషణ్, శశాంక్ పసుపులేటి, అబ్దుల్లా బకరాన్, సీనియర్ ఏఐపీసీ సభ్యులు ఇర్ఫాన్ అజీజ్, కార్తిక్ రెడ్డి ఎం, అడ్వకేట్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .