ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం బ్యూరో, అక్టోబర్ 5, తెలంగాణ ముచ్చట్లు;

తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం ఖమ్మం జిల్లాలో పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. పాలేరు, ఖమ్మం, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో కొర్ర రమేష్ నివాసంలో నూతన గృహప్రవేశ వేడుకకు హాజరై దంపతులకు అభినందనలు తెలిపారు. అనంతరం ఖమ్మం నగరంలోని గుర్రం జగన్మోహన్‌రావు ఫంక్షన్‌హాల్‌లో 60వ డివిజన్ కార్పొరేటర్ బద్దె నిరంజన్ కుమారుని పంచెకట్టు వేడుక, అలాగే ఎస్‌.ఆర్‌. కన్వెన్షన్‌లో కాంగ్రెస్ నాయకుడు భీమనాధుల అశోక్‌రెడ్డి కుమార్తె ఓణీల అలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.


WhatsApp Image 2025-10-05 at 7.40.45 PM (1)మధిర మండలం ఆత్కూరు గ్రామంలో కంభంపాటి సురేష్ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి నూతన దంపతులకు ఆశీర్వాదాలు అందజేశారు. ఇల్లూరులో ఇటీవల వివాహం చేసుకున్న కోట రామారావు కుమారుడు, కోడలిని ఆశీర్వదించారు. మర్లపాడు గ్రామంలో అనారోగ్యంతో మరణించిన యువకుడు లక్ష్మా రెడ్డి కుటుంబాన్ని మంత్రి పరామర్శించి సానుభూతిని తెలిపారు. 

వేంసూరు మండలం అడసర్లపాడు గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు అట్లూరి సత్యనారాయణరెడ్డి నిర్వహించిన చండీహోమంలో పాల్గొని పూజలు చేశారు. కుంచపర్తి గ్రామంలో కుక్కపల్లి రామకృష్ణ కుమారుడు, కోడలిని ఆశీర్వదించిన మంత్రి, శంభునిగూడెం గ్రామంలో అర్వపల్లి నరసింహారావు కుమారుని రిసెప్షన్‌లో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .