కమ్యూనిస్టు యోధుడు బొల్లోజు అయోధ్యకు మంత్రి పొంగులేటి నివాళి

కమ్యూనిస్టు యోధుడు బొల్లోజు అయోధ్యకు మంత్రి పొంగులేటి నివాళి

ఖమ్మం బ్యూరో చీఫ్, తెలంగాణ ముచ్చట్లు:

IMG-20250817-WA0079ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ బొల్లోజు అయోధ్య కుటుంబాన్ని ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పరామర్శించారు. మణుగూరు మండలంలోని రామానుజవరం గ్రామానికి వెళ్లిన మంత్రి పొంగులేటి అయోధ్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వారి దుఃఖంలో తాను, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు."ప్రజా హక్కుల కోసం ఎప్పుడూ అణగారని ధైర్యం చూపిన కమ్యూనిస్టు యోధుడు అయోధ్య. ఆయన పేరు వామపక్ష ఉద్యమ చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది. ఆయన మృతి వామపక్ష ఉద్యమాలకు తీరని లోటు" అని మంత్రి అన్నారు.ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా కుటుంబాన్ని పరామర్శించారు. అయోధ్య ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి, సీపీఐ నాయకత్వానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .