52 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కడియం
చిల్పూర్,తెలంగాణ ముచ్చట్లు:
చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామంలో రూ. 25 లక్షలతో గ్రామపంచాయతీ భవన నిర్మాణం, రూ. 12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణం, రూ. 20 లక్షలతో అంతర్గత సీసీ రోడ్డు పనులకు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాష్ట్రంలో 25 లక్షల మంది రైతుల రుణమాఫీకి రూ. 21 వేల కోట్లను కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు దేశంలోనే ప్రత్యేకమైనవి అన్నారు.
ఏకకాలంలో 55 వేల నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని, ఉద్యోగ అవకాశాలను కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.
లింగంపల్లి గ్రామం తనకు ప్రత్యేకమైన అభిమానం కలిగిన ప్రాంతమని, గ్రామపంచాయతీ భవనాన్ని ఏడాదిలోపు పూర్తి చేయడంతో పాటు, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంట సాగుకు గోదావరి జలాలను వచ్చే వర్షాకాలానికి అందిస్తానని హామీ ఇచ్చారు..jpeg)
నియోజకవర్గానికి 6,500 ఇళ్లను మంజూరు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వీటి ద్వారా బడుగు, బలహీన వర్గాలకు స్వప్నగృహాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు విమర్శలు చేయడం ప్రజలకు అర్థమవుతోందని, ప్రజా సంక్షేమం కోసం ప్రతి వర్గాన్ని ఆదుకోవడం కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


Comments