ప్రజాపాలన విజయోత్సవంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి,తెలంగాణ ముచ్చట్లు:
జనగామ జిల్లా పాలకుర్తి మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజాపాలన విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు.
ఈ వేడుక సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, తనకు మద్దతు ఇచ్చి విశ్వాసం ఉంచిన పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమమే తన ముఖ్య ఉద్దేశమని, పార్టీ శ్రేణులతో కలిసి సమష్టిగా మరింతగా సేవలందించడానికి కట్టుబడి ఉన్నామని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణతో పాటు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గిరగాని కుమార స్వామి, ధరావత్ సురేష్ నాయక్, నల్ల శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయోత్సవ వేడుకలను మరింత ఘనత చేశారు.పార్టీ శ్రేణులు ప్రజల ఆశయాల సాధనలో ముందుండి పనిచేస్తామని ఈ సందర్భంగా నాయకులు హామీ ఇచ్చారు.


Comments