ప్రభుత్వం పెంచిన కామన్ డైట్ చార్జీలతో పిల్లల విద్యాభివృద్ధికి మరింత తోడ్పాటు.. 

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ప్రభుత్వం పెంచిన కామన్ డైట్ చార్జీలతో పిల్లల విద్యాభివృద్ధికి మరింత తోడ్పాటు.. 

విద్యార్థినులు అవకాశాలను వినియోగించుకొని గొప్ప స్థాయికి ఎదగాలి..

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కామన్ డైట్ చార్జీల వలన పిల్లల విద్యాభివృద్ధికి మరింత తోడ్పాటు లభిస్తుందని, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ఉన్న సదుపాయాలను వినియోగిస్తూ విద్యార్థినులు జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకాక్షించారు. శనివారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం తనికెళ్ల లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలను సందర్శించారు. కలెక్టర్ కు స్కాడ్స్ విద్యార్థులు స్వాగతం పలికారు. ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలకు అనుగుణంగా తయారు చేసిన కొత్త డైట్ మెనూను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రారంభించారు. 
రెసిడెన్షియల్ కాలేజ్ తిరిగి వసతి గృహంలో ఉన్న స్టోర్ రూమ్, లైబ్రరీ, డార్మెటరీ, వంటగది, డైనింగ్ రూమ్ లను కలెక్టర్ పరిశీలించారు‌.  విద్యార్దులు వారి తల్లిదంద్రులతో ముచ్చటించారు. కావలసిన వసతులు, సౌకర్యాల పై ఆరాతీసారు. అనంతరం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ విద్యార్థినులకు, వారి తల్లిదండ్రులకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ వసతి గృహంలో పెంచిన కామన్ డైట్ చార్జ్  వలన విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం మనకు అందుతున్న అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ బాలికలు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు.  ఒక గొప్ప లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాని సాధన కోసం ప్రణాళికా బద్ధంగా శ్రమించాలని, మనం ఎటువంటి పరిస్థితుల నుంచి వచ్చిన ఉన్న సదుపాయాలు, విద్యను వినియోగించి గొప్ప విజయాలు సాధించవచ్చని కలెక్టర్ తెలిపారు. బాలికలు చిన్న లక్ష్యాలు కాకుండా పెద్ద కలలు కనాలని, విద్యార్థినులకు కెరియర్ గైడెన్స్ ఇచ్చేందుకు అవసరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. జీవితంలో మనం గొప్ప స్థాయికి చేరుకున్న తర్వాత సమాజంలో నలుగురికి సహాయం అందించి వారి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని అన్నారు. 
 మన స్నేహితులలో ఎవరైనా ఇబ్బందికర పరిస్తితిలో ఉంటే సహాయం అందించాలని,  ఇతరులతో కలిసి ఎదిగే ఆలోచన పెట్టుకోవాలని అన్నారు.  ప్రతిరోజు మనకు అనేక ఆటంకాలు వస్తాయని, వాటిని ఎలా దాటుతామనే అంశంలో విజేత ఉంటారని అన్నారు. WhatsApp Image 2024-12-14 at 6.34.32 PM (1)

ఈ కార్యక్రమంలో  కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. శ్రీవాణి, వైస్ ప్రిన్సిపాల్ యం.నవ్య, ఐక్యూఏసి కో-అడినేటర్ కె.పి. ఐశ్వర్య, సిజిసి కో-అడినేటర్ బి. రాజేశ్వరి, కె. చంద్రయ్య, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .