ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ప్రోటోకాల్ విరుద్ధంగా పాల్గొనడం సరైన పద్ధతి కాదు
-బాద్యులైన అధికారులపై పిర్యాదు చేస్తాను
జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:
నిన్న జనగామ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా నిర్వహిం చడం చాలా దురదృష్టకరం. ఎమ్మెల్యే లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలతో వేదికను నింపి అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం తీవ్రంగా నిరసిస్తున్నాని జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
-నియోజకవర్గ ఎమ్మెల్యే లేకుండా కార్యక్రమం నిర్వహించకూడదు.
ఒక నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఆ నియోజ కవర్గ ఎమ్మెల్యే లేకుండా జరగకూడదు. ప్రోటోకాల్ విరుద్ధంగా ఎంపీ వచ్చి చేయడం సరైన పద్ధతి కాదు. ఇందుకు కారణమైన అధికారులపై
పిర్యాదు చేస్తాను. ఇందిరమ్మ ఇళ్ల గురించి అర్హులైన వారికి కాకుండా ఇల్లు ఉన్న వారికి అనర్హులకు ఇచ్చారని కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడ డాన్ని మీడియా మొత్తం చూపించింది.
-ఎంపీ అసభ్యంగా మాట్లాడిన వాఖ్యలను జనగామ ప్రజానీకం తీవ్రంగా ఖండిస్తుంది..
జనగామ నియోజకవర్గంలో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి చాలా అసభ్యం గా మాట్లాడుతూ ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధిగా కాకుండా ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం లేని ఒక అవివేకిగా అహంకారంతో భూతులు మాట్లాడాడు. విమర్శ చేయడానికి ఏ జర్నలిస్ట్ మిత్రుడిని రాసి ఇవ్వ మని అంటే రాసి ఇస్తాడు. భాష తెలియదు భావం అంతకంటే తెలియదు. రాజకీయంగా భూతులు మాట్లాడడం తెలుసు. ఇటువంటి కాంగ్రెస్ నాయకులు మొన్న జరిగిన మిస్ ఇండియా పోటీల్లో కూడా ఇదే విధం గా ప్రవర్తన భాషతో కించ పరచడాన్ని ఆ పోటీలను అబాస్ పాలు చేయ డాన్ని తెలంగాణ ప్రజలు ఇంకా మరిచిపోలేదు. మిస్ ఇండియా నిర్వ హణ అబాస్ పాలు కావడానికి ఇటువంటి కాంగ్రెస్ నాయకులే కారణం. ఆయన మాట్లాడిన వాఖ్యలను విన్న జనగామ ప్రజలు ముఖ్యంగా మహిళలు ఇటువంటి అతడిని ఎంపీగా ఎన్నుకున్నామా అని చింతి స్తోంది. సభ్య సమాజం తలదించుకుంటుంది. వారు మాట్లాడిన బూతు పంచాంగాన్ని జనగామ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా మహిళలు అందరూ మూకుమ్మడిగా తీవ్రంగా ఖండిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


Comments