చిన్నారి అక్షితను ఆశీర్వదించిన ఎంపీ, ఎమ్మెల్యే
వనపర్తి ,తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామానికి చెందిన రజిత కీర్తిశేషులు వెంకట్ రెడ్డి గార్ల కుమార్తె అక్షిత పుట్టు చీర కార్యక్రమానికి హాజరైన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి , వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి చిన్నారిని ఆశీర్వదించారు.పిల్లల జీవితాల్లో ఇలాంటి కార్యక్రమాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని వారి ఆనందాలను తల్లిదండ్రులుగా మనం గౌరవించాల్సిందేనని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా తన సోదరుడి కుమార్తె కు సంబంధించిన ఇట్టి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మణిగిల్ల గ్రామ మాజీ సర్పంచ్ సరిత తిరుపతి రెడ్డి గార్లను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో డి సి సి బి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments