హక్కుల కోసం నిరంతరం పోరాడాలి.

హక్కుల కోసం నిరంతరం పోరాడాలి.

 హసన్ పర్తి,సెప్టెంబర్ 26 ( తెలంగాణ ముచ్చట్లు):

 ఇటీవల విద్యుత్ ఉద్యోగిగా పదవీ విరమణ పొందిన దళిత బహుజన ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు,ఎస్సీ,ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రౌతు రమేష్ కుమార్ ను ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ నేత ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి కృష్ణారెడ్డి, కార్యదర్శి సీనియర్ జర్నలిస్టు కన్నా పరశు రాములు,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉదయం దినపత్రికలో విలేఖరి గా పనిచేస్తూ ఎన్నో స్ఫూర్తిదాయకమైన వార్తలు రాసి ప్రజల్లో మంచి గుర్తింపు పొందారని నిరంతరం ప్రజా సమస్యలపై రైతు రమేష్ కలం పోరాడిందని కొనియాడారు.ఓవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే దళిత బహుజనుల సంక్షేమం, హక్కుల కోసం నిరంతరం పోరాడారని అన్నారు. పదవీ విరమణ తర్వాత కూడా రౌతు రమేష్ కుమార్ ప్రజల్లో ఉండాలని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .