మోజర్ల ఉద్యాన కళాశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవం వేడుకలు
అసిస్టెంట్ ప్రొఫెసర్ భాస్కర్, నవ్య శ్వేత
పెద్దమందడి,నవంబర్26(తెలంగాణ ముచ్చట్లు):
పెద్ద మందడి మండల పరిధిలోని మోజర్ల ఉద్యాన కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జాతీయ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రాం ఆఫీసర్లు భాస్కర్, నవ్య శ్వేతా నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు విద్యతో పాటు రాజ్యాంగాన్ని చదివే అలవాటు కూడా తప్పక కలిగి ఉండాలి అని భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా.. రాజ్యాంగంపై ఉపన్యాస పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు ఇంచార్జ్ అసోసియేట్ డీన్ డా. షహనాజ్ అందజేశారు.డా. షహనాజ్, మన దైనందిన జీవితంలో రాజ్యాంగం ఎంత ముఖ్యమైనదో వివరించి, ప్రతి ఒక్కరు దీని గురించి అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులు రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్లు డా. మాధవి, అశ్విని, దీపిక, నాన్-టీచింగ్ సిబ్బంది అబ్రహాం, జయమ్మ, రేణుక మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


Comments