శ్రీ గ్లోబల్ హైస్కూల్లో జాతీయ విద్యా దినోత్సవం....

శ్రీ గ్లోబల్ హైస్కూల్లో జాతీయ విద్యా దినోత్సవం....

ఖమ్మం బ్యూరో, నవంబర్ 11, తెలంగాణ ముచ్చట్లు;

చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గ్లోబల్ హైస్కూల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137 వ జయంతి సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఇనుకుల్ల దివాకర్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి నెహ్రూ నాయకత్వంలోని క్యాబినెట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, ఆయన పుట్టినరోజు సందర్భంగా జాతీయ విద్య దినోత్సవం వేడుకలు నిర్వహిస్తారని వివరించడం జరిగింది. హిందీ, అరబిక్, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ పండితుడని, 11 సంవత్సరాల పాటు విద్యా శాఖ మంత్రిగా పనిచేశారని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు చదువుకోవాలని ఆశయంతో కులమత బేధాలు లేకుండా పనిచేశారని అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1992లో భారతరత్న అవార్డు అందజేసి గౌరవించిందని వివరించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులందరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని విద్యలో రాణిస్తూ సమాజ సేవ చేయాలని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజ్మెంట్ అయినటువంటి వాహిని, తిరుపతి రెడ్డి, సుధాకర్ రెడ్డి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .