హెచ్ బీ కాలనీలో నూతన డీఐ పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కార్పొరేటర్ ప్రభుదాస్,పన్నాల దేవేందర్
కాప్రా, సెప్టెంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్‌లోని హెచ్ బీ కాలనీ ఫేజ్-1 మెయిన్ రోడ్డులో మంచినీటి పాత పైప్‌లైన్ పగిలి, మంచినీటిలో మురుగు నీరు కలిసిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి నూతనంగా ఏర్పాటు చేస్తున్న డీఐ పైప్‌లైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ – “ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తాను. కాలనీల సమస్యలు పరిష్కరించేందుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాను” అని హామీ ఇచ్చారు. అనంతరం కాలనీవాసుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ మాట్లాడుతూ – “డివిజన్ అభివృద్ధి విషయంలో సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే కి ధన్యవాదాలు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏఈ వేణుగోపాల్, కాలనీ ప్రెసిడెంట్ శివరాం ప్రసాద్, గోవిందరెడ్డి, ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు బోదాసు లక్ష్మీనారాయణ, నేమూరి మహేష్ గౌడ్, రమణ, శివ, దుర్గయ్య, బాబూరావు, నరేష్, దండెం నరేందర్, నిసార్ అహ్మద్ గోరి మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.


Comments