నూతన సంవత్సరం ప్రతి ఒక్కరిలో ఆనందం నింపాలి....
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
-ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలి
-జిల్లా ప్రగతిలో సహాయ, సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
నూతన సంవత్సరం ప్రతి ఒక్కరిలో ఆనందం నింపాలని, ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబాలలో సంతోషం వెల్లివిరియా లని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకాంక్షించారు. గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ నూతన సంవత్సరం సందర్భంగా అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులతో కలిసి కేకును కట్ చేసారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, సాంస్కృతిక సారథి కళాకారులు జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన సంవత్సరం లో ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా ప్రజలకు అందించుటకు ప్రణాళికబద్ధంగా పని చేయాలన్నారు. జిల్లా ప్రగతిలో సహాయ, సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు..jpeg)
నూతన సంవత్సరంలో ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలైనా ఇందిరమ్మ ఇండ్లు, అర్హులకు గ్యారెంటీ పథకాల అమలు, అభివృద్ధి చర్యలు, జాతీయ రహదారుల నిర్మాణం వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా జరిగేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. నూతన సంవత్సరంలో ప్రతి ఉద్యోగి తన ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ప్రతి రోజు కొంత సమయం నడవాలని, మంచి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని, రోజు శారీరక వ్యాయామం చేయాలని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు వ్యక్తిగత జీవితాల్లో కూడా ఉద్యోగులు సఫలీకృతం కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ను పక్కాగా పాటించాలని, ప్రభుత్వం నిర్దేశించిన విధులు విజయవంతంగా చేస్తూనే మన వ్యక్తిగత బాధ్యతలను సైతం పక్కగా నిర్వహించుకోవాలని ప్రణాళికా బద్ధంగా ముందడుగు వేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


Comments