వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా వడ్డే శేఖర్ నామినేషన్
పెద్దమందడి,నవంబర్28(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వడ్డే శేఖర్ శుక్రవారం మొదటి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా వడ్డే శేఖర్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని పోటీ చేస్తున్నానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. శుభ్రత, నీటి సదుపాయాలు, రహదారుల అభివృద్ధి వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు, మద్దతు నాకు అత్యంత అవసరం. గ్రామ అభివృద్ధి కోసం, వెల్టూర్ కు మరింత మంచి రోజులు తీసుకురావడానికి నన్ను సర్పంచ్ గా గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుతున్నాను. మీ నమ్మకానికి తగిన విధంగా పని చేసి, గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాను అని వడ్డే శేఖర్ తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినందుకు వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
నామినేషన్ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments