టిడిపి కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఖమ్మం పార్లమెంట్ మాజీ ప్రధాన కార్యదర్శి కేతినేని హరిష్ చంద్ర ఆధ్వర్యంలో
తెలుగుజాతి గుండెచప్పుడు
శ్రీ నందమూరి తారక రామారావు సినీ సినీ వారసత్వానికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డా. శ్రీ నందమూరి తారక రామారావు అపూర్వ సినీ ప్రయాణాన్ని పురస్కరించుకొని
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్లమెంటరీ అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విచ్చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరము కేకును కట్ చేసి ఎన్టీఆర్ గారితో పాటు పార్టీకి సేవలందించిన సీనియర్ టి.డి.పి క్యాడర్ నాయకులు,కార్యకర్తలకు సన్మానించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీ రామారావు చేసిన సేవలను గుర్తుతెచ్చుకొని కొనియాడారు, రెండు రూపాయలకే కిలోబియ్యం పథకాన్ని ఆరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఘనత ఎన్టీ రామారావుకి దక్కుతుందని అన్నారు. ఈ పథకాన్ని ఇప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కొనసాగింపు చేస్తున్నారని ఏ ప్రభుత్వము వచ్చిన తీయజాలరని అన్నారు. ఆరోజు ఎన్టీఆర్ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళుఅని పేద ప్రజలకు సేవ చేయడానికి నేను రాజకీయాలకు వచ్చానని ఆరోజు ఎన్టీరామారావు అన్న మాటలను ఈరోజు నేతలు గుర్తు తెచ్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో మల్లాది హనుమంతరావు, మంద వెంకటనారాయణ, ఓర్స్ కృష్ణ, తలపనేని జయరాం, మందపల్లి కోటి, చండ్ర రవికుమార్, చెరుకూరు చలపతిరావు, మందడపు సుధాకర్, హనుమంతు రెడ్డి, కుతుంబక కృష్ణ ప్రసాద్, జహీరా బేగం, కర్నాటి సీతారాములు, దామ శ్రీను, చింతనిప్పు నాగేశ్వరరావు, నాగండ్ల లక్ష్మణ్, నారాయణ రావు, పృద్వి, కూచిపూడి జై, తదితరులు పాల్గొన్నారు.


Comments