బి గంగారంలో 15వ బెటాలియన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం వైభవంగా.!
సత్తుపల్లి, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి మండలం బి.గంగారం గ్రామంలోని 15వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో గురువారం పోలీసు జెండా దినోత్సవం–2025 కార్యక్రమాల లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బెటాలియన్‌లో ఉన్న వివిధ రకాల ఆధునిక తుపాకులను విద్యార్థులకు ప్రదర్శించారు. తుపాకుల సామర్థ్యాలు, పనితీరును వీడియో ప్రదర్శన ద్వారా విద్యార్థులకు వివరించారు.
తరువాత బెటాలియన్ కమాండెంట్ ఏ. అంజయ్య మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జెండా దినోత్సవ కార్యక్రమాల లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు తుపాకుల గురించి ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని వివరించారు.
ఈ కార్యక్రమంలో బెటాలియన్ ఉప కమాండెంట్లు ఎస్. శ్రీధర్ రాజా, యస్.డి. రంగారెడ్డి, విశ్వశాంతి పాఠశాల నిర్వాహకుడు బి. నాగేశ్వరరావు, డి.ఏ.వి. పాఠశాల, గంగారం హై స్కూల్, విశ్వశాంతి పాఠశాల యాజమాన్య సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధికారులు, కానిస్టేబుళ్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments