వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి

తెలంగాణ రైతు సంఘం డిమాండ్.

వరి కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి

.దమ్మపేట, అక్టోబర్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రైతు సంఘం (ఏ.ఐ.కే.ఎస్) దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు రైతులు ధర్నా నిర్వహించారు. మండలంలో వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధరకు రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని, గతంలో రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి పెండింగ్‌లో ఉన్న బోనస్ బకాయిలు తక్షణం చెల్లించాలని కోరారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, తహసీల్దార్ భగవాన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దొడ్డా లక్ష్మీనారాయణ, మండల ఉపాధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు, రైతు నాయకులు రావుల శోభన్ బాబు, కొలిక్కి పోగు శ్రీనివాసరావు, చెన్నుబోయిన బ్రహ్మయ్య, తంగెళ్ళమూడి రమేష్, కొప్పుల శ్రీనివాసరావు, తంగెళ్ళమూడి నాగు, రామారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .