అయ్యప్ప స్వామి మహాపడి పూజా మహోత్సవంలో పాల్గొన్న పరమేశ్వర్ రెడ్డి
మల్లాపూర్, డిసెంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని కె.ఎల్. రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్లో అరుణోదయ కళా సంస్కారిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 16వ అయ్యప్ప స్వామి మహా పడి పూజా మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి పూజలు భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం, సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య సోదరభావాన్ని బలపరుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అరుణోదయ కళా సంస్కారిక వేదిక అధ్యక్షులు సి. రాధాకృష్ణన్, కార్యదర్శి సునీష్ జాకోబ్, కోశాధికారి ఎం. బిజూ కుమార్, కె.ఎల్. రెడ్డి నగర్ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్, వి.ఎస్. ప్రకాష్ రెడ్డి, మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పర సాయి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దంతూరి రాజు గౌడ్, కోయగూర బాలరాజ్, ఎస్.వి. కిట్టు, వి. శ్రీనివాస్, కె. రాజేష్, రుపేందర్ రెడ్డి, కె. సురేష్, ఎం. జయంత్ గౌడ్, వంగవీటి వ్రిన్కు, వినీష్ యాదవ్తో పాటు స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments