పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములుగా చేయాలి.

 హనుమకొండ జిల్లా విద్యాధికారి వాసంతి.

పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములుగా చేయాలి.

 హనుమకొండ,సెప్టెంబర్ 19(తెలంగాణ ముచ్చట్లు):

సెప్టెంబర్ 20న తల్లిదండ్రుల,ఉపాధ్యాయుల సమావేశం ప్రభుత్వ,స్థానిక సంస్థల,కస్తూరిభా గాంధీ విద్యాలయాలు,తెలంగాణ ఆదర్శ పాఠశాలలో సంతోషకరమైన సురక్షితమైన దసరా సెలవులు అనే అంశంపై సమావేశం నిర్వహించాలని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి ఆదేశించారు. ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు విధిగా రాతపూర్వకంగా లేదా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి తల్లిదండ్రులు హాజరయ్యే విధంగా చూడాలని సూచించారు. మండల విద్యాశాఖ అధికారులు,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వారి పరిధిలో గల పాఠశాలలలో తల్లిదండ్రుల సమావేశం జరుగుతున్న తీరును పరిశీలించాలని అన్నారు. ఏ పాఠశాలలో తల్లిదండ్రులు హాజరు తక్కువగా ఉంటుందో వాటి మీద ప్రధానంగా దృష్టి పెట్టాలని కోరారు.చాలామంది తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు,పట్టణ ప్రాంతాల్లో రోజువారి కూలీలుగా పనిచేస్తుంటారు.కాబట్టి వారికి వీలైన సమయంలో సమావేశం నిర్వహించాలని అన్నారు.తల్లిదండ్రుల సమావేశంలో పిల్లల యొక్క బేస్ లైన్ పరీక్ష, నిర్మాణాత్మక పరీక్షల,ప్రీ మిడ్ లైన్ పరీక్షల ఫలితాల గురించి చర్చించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించాలని చెప్పారు. హాజరు శాతం తక్కువగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడాలని పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములుగా చేయాలని అదనపు సమాచారం కోసం కమ్యూనిటీ మొబై లైజింగ్ అధికారి బద్దం సురేష్ రెడ్డి 9603672289ను సంప్రదించాలని అన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .