ధాన్యం రైతులకు పేమెంట్ వెంటనే చేయాలి
-హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
Views: 18
On
హనుమకొండ,తెలంగాణ ముచ్చట్లు:
ధాన్యం విక్రయించిన రైతులకు పేమెంట్ విషయంలో ఆలస్యం లేకుండా త్వరగా చెల్లింపులు పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అధికారులను ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు మరియు పేమెంట్ అంశంపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ధాన్యం కొనుగోలు, మిల్లులకు తరలింపు, ఆన్లైన్ ప్రక్రియ, రైతులకు పేమెంట్ వివరాలను కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా ప్రావిణ్య మాట్లాడుతూ, రైతుల పేమెంట్ ప్రక్రియ వేగంగా సాగించాలని, అలాగే సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ సొమ్ము కూడా వెంటనే చెల్లించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments