పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలి

ప్రభుత్వ హామీ అమలు చేయాలని  డిమాండ్ ఉన్నికృష్ణన్ 

పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలి

మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్, అక్టోబర్ 30 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు, వేతనాలు తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని తెలంగాణ మిడ్ డే మీల్స్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నేతలు డిమాండ్ చేశారు.గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఉన్నికృష్ణన్ కె., కార్యదర్శి ప్రేమలత మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు కార్మికులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దసరా పండగ రోజున కూడా కుటుంబాలు పస్తులయ్యే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఎన్నికల ముందు కార్మికులకు రూ.10,000 వేతనం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ వాగ్దానం ఇప్పటికైనా అమలు చేయాలని కోరారు. నెలల తరబడి వేతనాలు రాకపోతే వంట ఎలా చేస్తారని ప్రశ్నించారు. కొత్త మెనూ పేరుతో ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీలు కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
కార్మికులు విద్యార్థులను తమ కుటుంబసభ్యుల్లా భావించి నాణ్యమైన భోజనం అందిస్తున్నారని, ప్రభుత్వం ఈ సేవాభావాన్ని గుర్తించి వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని మెనూ చార్జీలను పెంచాలని, అంగన్‌వాడీ మాదిరిగా గుడ్లను ప్రభుత్వం సరఫరా చేయాలని, ఉచిత గ్యాస్, కాటన్ యూనిఫామ్ అందించాలని, కనీస వేతనం రూ.26,000 అమలు చేయడమేగాక ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ధర్నాలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్. శ్రీనివాస్, యూనియన్ నాయకులు విజయలక్ష్మి, మంజుల, జయ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు
పెద్దమందడి,నవంబర్02(తెలంగాణ ముచ్చట్లు): రైతులు లాభసాటి వ్యవసాయం చేయాలంటే నాణ్యమైన వరి విత్తనాలను వాడటం అత్యవసరమని వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు అధికారులు సూచించారు. పెద్దమందడి మండల పరిధిలోని పామిరెడ్డి...
తుఫాన్ బాధిత రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి 
విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
మృతుని కుటుంబానికి మేఘన్న చేయూత
హరీష్‌రావు నివాసంలో రేగళ్ల సతీష్‌రెడ్డి, యువజన నేతల పరామర్శ
బీసీలకు 42% రిజర్వేషన్లపై కఠిన పోరాటం  ఈటల రాజేందర్
నారాయణ స్కూల్ లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్.!